టాలీవుడ్ వర్కర్స్ స్ట్రైక్ లో జాయిన్ అయిన పోస్ట్ ప్రొడక్షన్ టీం

టాలీవుడ్ వర్కర్స్ స్ట్రైక్ లో జాయిన్ అయిన పోస్ట్ ప్రొడక్షన్ టీం

Published on Oct 21, 2014 5:43 PM IST

TFI
టాలీవుడ్ లో వర్కర్స్ యూనియన్ తమ జీతాలను పెంచాలని చేస్తున్న స్ట్రైక్ వారం రోజులుగా కొనసాగుతూనే ఉంది. నిన్నటి నుంచి ఆ స్ట్రైక్ మరింత తీవ్ర రూపం దాల్చిందని చెప్పాలి. ఎందుకంటే గత వారం రోజులుగా షూటింగ్స్ కి మాత్రమే బ్రేక్ ఇచ్చి వర్కర్స్ స్ట్రైక్ చేసారు. కానీ నిన్నటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ కి సంబందించిన అందరూ స్ట్రైక్ చేయడం మొదలు పెట్టడంతో సినిమాకి సంబందించిన 24 క్రాఫ్టుల వర్క్స్ అన్నీ ఆగిపోయాయి.

ప్రస్తుతం డబ్బింగ్, ఎడిటింగ్, రీ రికార్డింగ్, డిఐ మిక్సింగ్ దశలో ఉన్న పలు సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. వర్కర్స్ యూనియన్ తమ జీత భత్యాలు 32 నుంచి 50% పెంచాలని కోరుతున్నారు. కానీ నిర్మాతల మండలి ఒకేసారి అంత పెంచలేమని ఒక 20% వరకూ పెంచడానికి సముఖత చూపుతున్నారు. కానీ దానికి వర్కర్స్ యూనియన్ వారు నో చెప్పడంతో చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. షూటింగ్ లతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా ఆగిపోవడం నిర్మాతలకి చాలా పెద్ద నష్టం కావున త్వరలోనే ఈ చర్చలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు