టాలీవుడ్ ఫస్ట్, ఆ తర్వాతే కోలీవుడ్, బాలీవుడ్

టాలీవుడ్ ఫస్ట్, ఆ తర్వాతే కోలీవుడ్, బాలీవుడ్

Published on Oct 23, 2014 3:12 PM IST

telugu-cinema-flag
ఇండియా మొత్తంలోనే సినిమా అంటే ఎక్కువ ఇష్టం, సినిమా వాళ్ళని అభిమానించి ఆరాధించే వాళ్ళలో తెలుగు ప్రేక్షకులే ముందుంటారు. ఈ మాట ఇప్పుడు నేను అన్నది కాదు, ఎప్పటి నుంచో పలువురు ప్రముఖులు అంటూ వస్తున్న మాట. అలాగే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా అత్యధిక థియేటర్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే ఉన్నాయి. దీన్ని బట్టి మన వాళ్ళు సినిమాలను ఎంతగా ఆదరిస్తారో తెలుసుకోవచ్చు..

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పను అంటే మన తెలుగు వారు సినిమాలను చూడడంలోనే కాదు తీయడంలోనూ మన టాలీవుడ్ అగ్రస్థానంలో ఉండడం విశేషం.. 2013 ఏప్రిల్ నుంచి 2014 మార్చి వరకు ఇండియాలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఏయే ఇండస్ట్రీ టాప్ 3 స్థానాలను దక్కించుకుంది అని చేసిన సర్వేలో టాలీవుడ్ కి నెంబర్ 1 ప్లేస్ దక్కింది. 2013-14 లో ఇండియా మొత్తంగా 1966 సినిమాలు రిలీజ్ అయితే అందులో 349 సినిమాలు తెలుగు నుంచే రావడంతో ఫస్ట్ ప్లేస్ దక్కింది. టాలీవుడ్ తర్వాత తమిళం 326 సినిమాలతో సెకండ్ ప్లేస్ లో ఉంటే, 263 సినిమాలతో బాలీవుడ్ మూడవ ప్లేస్ లో ఉంది. గత ఏడాది అనగా 2012-13 లో తమిళ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే తెలుగు సెకండ్ ప్లేస్ లో ఉంది.

మన తెలుగులో అన్ని సినిమాలు వస్తున్నా బాక్స్ ఆఫీసు వద్ద హిట్స్ గా నిలిచినవి మాత్రం చాలా తక్కువ. కానీ ఇన్ని సినిమాలు వస్తుండడానికి కారణం టెక్నికల్ గా డెవలప్ అవ్వడమే.. ఈ మధ్య వచ్చిన డిజిటల్ టెక్నాలజీ వల్ల ఫ్యాషన్ ఉన్న వారంతా లో బడ్జెట్ లోనే సినిమాలు చేస్తున్నారు. అలా చేసిన సినిమాలే ఎక్కువగా కూడా ఉంటున్నాయి. టెక్నాలజీతో పాటు సినిమా సక్సెస్ శాతం కూడా పెరిగితే తెలుగు ఇండస్ట్రీకి చాలా మంచి జరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు