ట్రైలర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసి పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్ !

ట్రైలర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసి పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్ !

Published on Dec 10, 2016 9:06 PM IST

sagar
రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ‘అయ్యారే’ చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన యువ దర్శకుడు సాగర్ చంద్ర తాజాగా వివాహం చేసుకున్నాడు. నల్గొండ జిల్లాలో గీత రెడ్డి అనే అమ్మాయితో ఆయన వివాహం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లో ఇంజనీరింగ్, యూఎస్ లో పోస్ట్ గ్రాడ్యువేషన్ చేసిన సాగర్ చంద్ర సినిమాలపై ఇష్టంతో సినీ రంగంవైపు అడుగులు వేశాడు.

ప్రస్తుతం ఈ యువ దర్శకుడు నారా రోహిత్ హీరోగా ‘అప్పట్లో ఒకడుండేవాడు’ అనే సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా తాలూకు ట్రైలర్ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కేవలం ఒకే ఒక ట్రైలర్ తో అందరి దృష్టీ తన వైపుకు తిప్పుకుంది. 90ల కాలంలో హైదరాబాద్ లోని పాతబస్తీ ప్రాంతంలో నివసించే ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

sagar1

సంబంధిత సమాచారం

తాజా వార్తలు