‘రౌడీ ఫెలో’ దర్శకుడిపై యువ హీరోల కన్ను

‘రౌడీ ఫెలో’ దర్శకుడిపై యువ హీరోల కన్ను

Published on Nov 22, 2014 11:22 PM IST

krishna-chaitanya
ఈ శుక్రవారం విడుదలైన ‘రౌడీ ఫెలో’ సినిమాతో గేయ రచయిత కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమాలో కమర్షియల్ కంటెంట్, ఫలితం వంటి విషయాలు పక్కన పెడితే మొదటి సినిమాతో తన ప్రతిభ గురించి ఇండస్ట్రీ ప్రముఖులకు కృష్ణ చైతన్య గట్టి సంకేతాలు పంపించాడు.

టెక్నికల్ విభాగాలను కృష్ణ చైతన్య హ్యాండిల్ చేసిన తీరు, మూవీ మేకింగ్ యువ హీరోలను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కృష్ణ చైతన్య రాసిన మాటలు తూటాల్లా పేలాయి. పురాణాలలో తత్వాన్ని, ప్రస్తుత సమాజంలో యువకుల ఆలోచనలను మేళవించి రాసిన మాటలు, ఈ కుర్రాడిలో సత్తా ఉందని తెలియజేశాయి. కమర్షియల్ కథను స్టైలిష్ వేలో బాగా ప్రెజెంట్ చేయగలడు అనే నమ్మకం అందరిలో కలిగించాడు. పలువురు యువ హీరోలు కృష్ణ చైతన్యతో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు అని ఫిల్మ్ నగర్ సమాచారం.

‘రౌడీ ఫెలో’తో రెగ్యులర్ రివెంజ్ డ్రామాను వైవిధ్యంగా తెరకెక్కించి మంచి మార్కులు కొట్టేసిన కృష్ణ చైతన్య, రెండవ సినిమా కోసం ఎటువంటి కథను సిద్దం చేస్తాడో..? హీరో ఎవరో..? కొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు