బాహుబలి రూమర్స్ ని ఖండించిన తమిళ్ స్టార్

బాహుబలి రూమర్స్ ని ఖండించిన తమిళ్ స్టార్

Published on May 24, 2015 10:01 AM IST

suriya-prabhas
తెలుగు తో పాటు తమిళంలో కూడా స్టార్ ఇమేజ్ ఉన్న హీరో సూర్య. ప్రస్తుతం సూర్య తన రాబోయే సినిమా ‘రాక్షసుడు(తమిళంలో మాస్)’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటె గత కొద్ది రోజులుగా ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి సినిమాలో సూర్య ఓ ప్రముఖ పాత్రలో కనిపించనున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా తెలుగు మీడియాతో ముచ్చటించిన సూర్యని బాహుబలి సెకండ్ పార్ట్ లో మిమ్మల్ని ఓ పాత్ర కోసం అప్రోచ్ అయ్యారటకదా అని అడిగితే

‘అసలు ఇవన్నీ బేస్ లెస్ రూమర్స్. ఇప్పటి వరకూ అలాంటి ఆఫర్ ఏమీ రాలేదు. చెప్పాలి అంటే ఈ సినిమాలో కోరికగా ఉంది. ఈ మీడియా ద్వారా రాజమౌళి గారిని రిక్వెస్ చేస్తున్నాను. ఒక చిన్న రోల్ ఇచ్చిన నేను చెయ్యడానికి సిద్దంగా ఉన్నాను. అలాగే తెలుగులో ఓ డైరెక్ట్ ఫిల్మ్ చెయ్యడానికి ఓ మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నానని’ సూర్య అన్నాడు. తెలుగు తమిళ భాషల్లో రాక్షసుడు సినిమా మే 29న విడుదల కానుంది. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నయనతార, ప్రణిత హీరోయిన్స్ గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు