మహేష్ ‘స్పైడర్’ లో మరో ఆసక్తికర అంశం !

మహేష్ ‘స్పైడర్’ లో మరో ఆసక్తికర అంశం !

Published on May 25, 2017 1:30 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.గత కొన్ని రోజులుగా ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలను చెన్నైలో చిత్రీకరిస్తున్నారు. సందేశాత్మక చిత్రాలను స్టైలిష్ గా చిత్రీకరించే మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకుడు.

ఈ చిత్రంలో మరో ఆసక్తికర అంశం వెల్లడైంది. ఈ చిత్ర క్లైమాక్ సన్నివేశాల కోసం జాతీయ అవార్డు గెలుచుకున్న వి ఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ కమల కణ్ణన్ పనిచేయనున్నారు. ఈగ, బాహుబలి వంటి చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా పనిచేసింది ఇతడే. రష్యాకి చెందిన ఓ సంస్థ స్పైడర్ కు విజువల్ ఎఫెక్ట్స్ ని అందించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు