రామ్ చరణ్ అభిమానుల మానవత్వం

Ram_Charan
ఫిల్మ్ స్టార్స్ కి ఉన్న క్రేజ్ అందరికంటే చాలా ఎక్కువ.. అందుకే వీళ్ళ ఎన్నో బ్రాండ్స్ కి అంబాసిడర్స్ గా ఉంటారు. అలాగే ఈ మధ్య స్టార్ హీరోలు ఎన్నో చారిటీల కోసం, సమాజంలో మంచి పనుల కోసం కూడా ఈ మధ్య మన ముందుకు వస్తున్నారు. ఇలా స్టార్స్ చేసే మంచి పనుల వలన తమ అభిమానులు కూడా ఎంతో ఇన్స్పైర్ అయ్యి, కొన్ని మిలియన్స్ మందిని ఒకటిగా కావడమే కాకుండా సొసైటీలో మంచి పనులకి దోహదపడుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వల్ల ఆయన ఫ్యాన్స్ కూడా ఆయన బాటలోనే ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తున్నారు.

ఎంతో మందికి స్పూర్తిగా నిలిచే ఓ సంఘటన ఈ రోజు ఖమ్మంలో జరిగింది, అది కూడా రామ్ చరణ్ అభిమానులు చేసారు. ఈ రోజు ఉదయం ఖమ్మంలో కొన్ని వేలమంది కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో మార్చి 27వరకూ తిరిగి చారిటీ కోసం మనీ కలెక్ట్ చేయనున్నారు. ఈ నెల 27న రామ్ చరణ్ బర్త్ డే. అందుకోసమే ఈ ట్రిప్ లో భారీగా అమౌంట్ ని కలెక్ట్ చేసి కొన్ని చారిటీ పనుల కోసం ఖర్చు చేయనున్నారు. ఈ రోజు రామ్ చరణ్ ఫ్యాన్స్ చేసింది చాలా మంది హృదయాలకు హత్తుకుంది. ఎందుకంటే ఈ స్మాల్ చేంజ్ సొసైటీలో ముందు ముందు మంచి పనులకి దారితీస్తుందని అంటున్నారు.

 

Like us on Facebook