లేడీ ఓరియెంటెడ్ సినిమాకు నో చెప్పిన త్రిష

లేడీ ఓరియెంటెడ్ సినిమాకు నో చెప్పిన త్రిష

Published on Oct 21, 2014 6:26 PM IST

trisha

సౌత్ ఇండియాలో వన్ అఫ్ ది స్టార్ అండ్ టాప్ హీరోయిన్ గా వెలుగొందిన వాళ్ళలో త్రిష కూడా ఒకరు. గతంతో పోల్చుకుంటే ఈ మధ్య త్రిషకి ఆఫర్స్ తగ్గాయనే చెప్పుకోవాలి. దాంతో పలు చిత్ర నిర్మాతలు ఎవరైతే తనతో ఆర్ట్ లేదా ప్రయోగాత్మక సినిమాలు చేయాలనుకున్నారో వారు అలాంటి కథలతో, పాత్రలతో త్రిషని కలుస్తున్నారు. వీటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టాలని త్రిష క్లియర్ గా ఆర్ట్ ఫిల్మ్స్ లేదా హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ అస్సలు చేయనని చెప్పింది. అంతే కాకుండా తను చేస్తున్న మాస్ మసాల సినిమాతోనే చాలా హ్యాపీగా ఉందని మరియు ముందు ముందు కూడా అవే చేస్తానని ఖరాఖండీగా చెప్పేసింది.

దాంతో కొంతమంది చిత్ర నిర్మాతలు షాక్ అయ్యారు. త్రిష తన కెరీర్లో చిన్న చిన్న అప్డ్స్ అండ్ డౌన్స్ చూసినా ఏనాడు సినిమాలు చేయకుండా మాత్రం లేదు. ఇప్పుడు ఆఫర్లు తగ్గాయని అందరూ చెప్పుకుంటున్నా త్రిష చేతిలో మాత్రం ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి బాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ సినిమా అయితే, మరొకటి కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమా. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి. అది కాకుండా ఇటీవలే త్రిష హీరోయిన్ గా నటించిన కన్నడ సినిమా ‘పవర్’ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు