పోలీస్ ప్రొటక్షన్ కోరిన త్రిష తల్లి !

పోలీస్ ప్రొటక్షన్ కోరిన త్రిష తల్లి !

Published on Jan 17, 2017 4:30 PM IST

tisha-and-mom
గత కొన్ని రోజులుగా తమిళ సినీ పరిశ్రమలో జల్లికట్టు మద్దతుదారులకు, టాప్ హీరోయిన్ త్రిషకు మధ్య జరుగుతున్న వివాదం తారా స్థాయికి చేరుకుంటోంది. జల్లికట్టుని విపరీతంగా వ్యతిరేకిస్తున్న పెట సంస్థతో ఉన్న సంబంధాలను వదులుకుని జల్లికట్టుకి సపోర్ట్ చేయాలని కొందరు త్రిష కొత్త చిత్రం షూటింగ్ జరుగుతున్న శివగంగ జిల్లాకు వెళ్లి షూటింగ్ ఆపి, ఆమె మీద మీద దాడి చేసినంత పనిచేశారు. దాంతో తీవ్రంగా హర్ట్ అయిన త్రిష ట్విట్టర్ ద్వారా వాళ్లపై విమర్శలు గుప్పించింది.

తరువాత ఆమె ట్విటర్ ద్వారా తాను జల్లికట్టుని ప్రోత్సహించనని, పెటతో ఉన్న సంబంధాన్ని వదలుకోనని ట్వీట్స్ వెలువడ్డాయి. దాంతో తమిళవాసుల్లో ఆగ్రహం మరింత ఎక్కువైంది. ఆ తరువాత త్రిష తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని, తాను సంప్రదాయాలను గౌరవిస్తానని తెలిపి తన అకౌంట్ డీ యాక్టివేట్ చేసింది. తాజాగా ఆమె తల్లి ఉమా కృష్ణన్ తన కూతురికి పోలీస్ ప్రొటక్షన్ కావాలని, ఆమె ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేసిన వారిని పట్టుకోవాలని సిటీ పోలీస్ కమీషనర్ కు తెలపడమే గాక త్రిష కేవలం ఫోటో షూట్ కోసమే పెట సంస్థతో కలిసి పని చేస్తోందని తెలిపింది. ఇప్పటికీ సద్దుమణగని ఈ ఉద్రిక్త పరిస్థితి ఎలా ముగుస్తుందో అని తమిళ సినీ, రాజకీయ వర్గాలు ఆందోళనగా ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు