నా పిడికిట్లో ఉన్న వజ్రాయుధం : పవన్ గురించి త్రివిక్రమ్..!

నా పిడికిట్లో ఉన్న వజ్రాయుధం : పవన్ గురించి త్రివిక్రమ్..!

Published on May 3, 2016 11:04 PM IST

trivikaram
నితిన్, సమంత హీరోహీరోన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అ..ఆ’ చిత్రం ఆడియో వేడుక సోమవారం సాయంత్రం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ గురించి ఆశువుగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి ఓ రేంజ్ లో మాట్లాడాడు. ఆ మాటలు ఇవి…

’కొండ ఒకరికి తలొంచి ఎరుగదు… శిఖరం ఒకరికి సలాం అని తలొంచి ఎరుగదు.. కెరటం అలసి పోయి ఒకరికోసం ఎప్పుడూ ఆగదు.. తుఫాన్ ఒకడి ముందు తలొంచి ఎరుగదు… నాకిష్టమైన స్నేహితుడు… నా సునామీ… నా ఉప్పెన.. నేను దాచుకున్న నా సైన్యం… నేను శత్రువు మీద చేసే యుద్ధం… నేను ఎక్కు పెట్టిన బాణం… నా పిడికిట్లో ఉన్న వజ్రాయుధం… నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు.. ఎంతో మంది గుండెలు తడపడానికి వచ్చిన ఒక చిన్న వర్షపు చినుకు… స్నేహ రుతుపవనం … పవన్ కళ్యాణ్ వెనకాలే వస్తారా…తోడుగా ఉందాం వస్తారా’ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ తన మనసులోని భావాలను అందరి ముందు వ్యక్తపరిచారు. పవర్ స్టార్ గురించి తివిక్రమ్ మాట్లాడున్నంతసేపూ అభిమానుల చప్పట్ల హోరుతో ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు