Like us on Facebook
 
ఎన్టీఆర్ సినిమా కోసం బాలీవుడ్ నటిని తీసుకొస్తున్న త్రివిక్రమ్!

ఎన్టీఆర్ తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ఘనంగా ప్రారంభోత్సవ వేడుకను జరుపుకుంది. ఎప్పటి నుండో కోరుకుంటున్న వీరిద్దరి కలయిక ఎట్టకేలకు కుదరడంతో తారక్ అభిమానులు, సగటు సినీ ప్రేక్షకులు రాబోయే ఔట్ ఫుట్ పట్ల ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

ఇకపోతే సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈసినిమాలోని ఒక కీలక పాత్ర కోసం సీనియర్ హీరోయిన్, బాలీవుడ్ నటి టబును తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట త్రివిక్రమ్. ఆమె చేరిక వలన పాత్రకు హుందాతనంతో పాటు సినిమాకు కొత్తదనం కూడా వస్తుందని త్రివిక్రమ్ భావిస్తున్నారట. అయితే ఈ వార్తపై చిత్ర టీమ్ నుండి ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ తో చేస్తున్న సినిమాలో సైతం సీనియర్ నటి కుష్బు చేత ఒక ముఖ్య పాత్ర చేయిస్తున్న సంగతి తెలిసిందే.

Bookmark and Share