పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న త్రివిక్రమ్

పవన్ కళ్యాణ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్న త్రివిక్రమ్

Published on Oct 1, 2016 1:23 PM IST

pawan-kalyan-trivikram
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ పెంచి 2019 ఎలక్షన్ల కల్లా ఎన్ని సినిమాలు వీలైతే అన్ని సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన డాలి డైరెక్షన్లో ‘కాటమరాయుడు’ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తైన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తారట. అధికారికంగా ప్రకటించకపోయినా ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ పనులను కూడా మొదలుపెట్టేశారట. పవన్ ఇమేజ్ కు తగ్గట్టు కథ ఉండేలా చూస్తున్నారట.

ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం ఆరంభంలో మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయని సన్నిహితవర్గాల నుండి సమాచారం కూడా అందుతోంది. పవన్ – త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘జల్సా, అత్తారింటికి దారేది’ చిత్రాలు ఘన విజయం సాదిండంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. అలాగే మరోవైపు ఏఎం రత్నం పవన్ తో తమిళ ‘జిల్లా’ సినిమాని రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు