త్రివిక్రమ్ హిట్ లిస్ట్ లో ప్రభాస్.

త్రివిక్రమ్ హిట్ లిస్ట్ లో ప్రభాస్.

Published on May 26, 2020 3:56 PM IST

డార్లింగ్ ప్రభాస్ తో మూవీ చేయాలని ఏ దర్శకుడికి ఉండదు . ఐతే అది అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారిన తరువాత రెండేళ్లకు ఓ మూవీ చేస్తున్నారు. బాహుబలి మూవీ తరువాత మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సాహూలో నటించిన ప్రభాస్, ఆ మూవీ కోసం రెండేళ్ల వ్యవధి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామా ఏడాదికి పైగా షూటింగ్ జరుపుకుంటుంది. కనీసం ఈ చిత్రాన్ని అయినా త్వరగా విడుదల చేస్తాడు అని భావిస్తే లాక్ డౌన్ కారణంగా అది కూడా లేటయ్యేలా ఉంది.

కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ హిట్ లిస్ట్ లో ప్రభాస్ ఉన్నారట. అవకాశం దొరికితే ప్రభాస్ తో మూవీ సెట్ చేయాలని త్రివిక్రమ్ ఆలోచనట. కానీ ప్రభాస్ నెక్స్ట్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఆ మూవీ విడుదల 2022లో ఉంది. ఈ లోపు ఎన్టీఆర్ మూవీ పూర్తి చేసి, ప్రభాస్ తో మూవీ సెట్ చేయాలనే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నారట. మరి చూద్దాం త్రివిక్రమ్ ప్రయత్నాలు ఎంత వరకు కార్యరూపం దాల్చుతాయో. వీరిద్దరి కాంబినేషన్ లో ఇంత వరకు మూవీ రాలేదన్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు