ఐఫాలో పోటీ పడుతున్న 2 బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్స్

ఐఫాలో పోటీ పడుతున్న 2 బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్స్

Published on Nov 29, 2015 11:45 AM IST

iifa

ఈ ఏడాది టాలీవుడ్ బాక్స్ ఆఫీసుని షేక్ చేసి 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిన సినిమాలు రెండు అవే బాహుబలి మరియు శ్రీమంతుడు. జూలైలో వచ్చిన బాహుబలి ఓవరాల్ గా 600 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి తెలుస్గు సినిమా స్థాయిని హాలీవుడ్ కి పరిచయం చేస్తే, శ్రీమంతుడు సినిమా 100 కోట్ల మార్క్ ని టచ్ చేసి సౌత్ లో తన సత్తాను చాటుకుంది. బాక్స్ ఆఫీసు వద్దే కాదు ఈ సినిమాలు ప్రస్తుతం అవార్డ్స్ వద్ద కూడా భారీగా పోటీ పడుతున్నాయి. డిసెంబర్ మొదట్లో దుబాయ్ లో జరగనున్న ఐఫా ఉత్సవమ్ అవార్డ్స్ లో బాహుబలి సినిమా 14 విభాగాల్లో నామినేట్ అయితే, శ్రీమంతుడు సినిమా 11 విభాగాల్లో నామినేట్ అయ్యింది.

ఐఫా ఉత్సవమ్ అవార్డ్స్ లో బాహుబలి నామినేట్ అయిన 14 విభాగాల వివరాలు :

బెస్ట్ పిక్చర్ – బాహుబలి

బెస్ట్ హీరో – ప్రభాస్

బెస్ట్ హీరోయిన్ – తమన్నా

బెస్ట్ నెగటివ్ రోల్ – రానా దగ్గుబాటి

బెస్ట్ డైరెక్టర్ – ఎస్ఎస్ రాజమౌళి

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – ఎంఎం కీరవాణి

బెస్ట్ సపోర్టింగ్ రోల్(ఫీమేల్) – రమ్యకృష్ణ

బెస్ట్ సపోర్టింగ్ రోల్(మేల్) – సత్య రాజ్

బెస్ట్ లిరిక్స్ – కె. శివదత్తా

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) – రేవంత్ మరియు దీపు

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫీమేల్) – సత్య యామిని, గీత మాధురి, దామిని

ఐఫా ఉత్సవమ్ అవార్డ్స్ లో శ్రీమంతుడు నామినేట్ అయిన 11విభాగాల వివరాలు :

బెస్ట్ పిక్చర్ – శ్రీమంతుడు

బెస్ట్ హీరో – మహేష్ బాబు

బెస్ట్ హీరోయిన్ – శృతి హాసన్

బెస్ట్ నెగటివ్ రోల్ – సంపత్ రాజ్

బెస్ట్ డైరెక్టర్ – కొరటాల శివ

బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – దేవీశ్రీ ప్రసాద్

బెస్ట్ లిరిక్స్ – రామజోగయ్య శాస్త్రి

బెస్ట్ సపోర్టింగ్ రోల్(ఫీమేల్) – తులసి

బెస్ట్ సపోర్టింగ్ రోల్(మేల్) – జగపతిబాబు

బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) – శాస్త్రీ సాగర్

సంబంధిత సమాచారం

తాజా వార్తలు