రామ్ చరణ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు?

రామ్ చరణ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు?

Published on Jan 16, 2017 10:10 PM IST

ram-charan
‘ధృవ’ సినిమాతో వరుస పరాజయాలకు చెక్ పెట్టిన మెగాహీరో రామ్ చరణ్ త్వరలో సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాని మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మొదట రాశి ఖన్నా హీరోయిన్ అని వార్తలొచ్చాయి. కానీ ఆ తరువాత అనుపమ పరమేశ్వరన్ ను తీసుకుంటున్నట్టు తెలిసింది. ఆ వార్త కూడా అధికారికంగా నిర్ణయమైపోయింది. మళ్ళీ ఇప్పుడు రాశి ఖన్నా పేరు సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ కథలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని, ఒకరు అనుపమ పరమేశ్వరన్ కాగా మరొకరు రాశి ఖన్నా అని అంటున్నారు.

ఇప్పటికే రాశి ఖన్నాతో చర్చలు ముగిశాయని, ఆమె ఓకే చెప్పడమే తరువాయి అని కూడా తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్లో నడిచే రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ‘ఖైదీ నెం 150’ చిత్రానికి పనిచేసిన రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు