ఈవారం సినిమాలు : రెండూ ప్రేమకథలే..!

ఈవారం సినిమాలు : రెండూ ప్రేమకథలే..!

Published on Feb 9, 2016 2:46 AM IST

garam
సంక్రాంతి తర్వాత ఆ స్థాయి క్రేజ్, హైప్‌తో పెద్దగా సినిమాలు రాలేదనే చెప్పాలి. ఇప్పటికీ సంక్రాంతికి సూపర్ హిట్‌గా నిలిచిన సినిమాలే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కొల్లగొడుతూండడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక మళ్ళీ నెల తర్వాత ఆ రేంజ్ హైప్‌తో ఈ శుక్రవారం తెలుగు సినిమా బాక్సాఫీస్ కళకళలాడనుంది. ఈ వారం నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’, ఆది హీరోగా నటించిన ‘గరం’ అనే రెండు సినిమాలు విడుదలవుతున్నాయి. ప్రేమికుల దినోత్సవానికి సరిగ్గా రెండు రోజుల ముందు వస్తోన్న ఈ రెండు సినిమాలూ ప్రేమకథలే కావడం విశేషంగా చెప్పుకోవచ్చు.

ఇక ఈ రెండిట్లో నాని ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’కు రిలీజ్‌కు ముందు నుంచే సూపర్ పాజిటివ్ టాక్ ఉంది. మూవీ టీమ్ చేపట్టిన ప్రమోషన్స్ కూడా అంచనాలను రెట్టింపు చేశాయి. పేరులోనే ప్రేమ గాథను నింపుకున్న ఈ సినిమా వాలెంటైన్స్ వీకెండ్‌లో సూపర్ కలెక్షన్స్ సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇక రెండో సినిమా ‘గరం’ విషయానికి వస్తే సాయికుమార్ తన సొంత ప్రొడక్షన్‌లో నిర్మించిన ఈ సినిమా కూడా పోస్టర్స్, ట్రైలర్‍తో బాగా ఆకట్టుకుంది. రెండు మతాలకు చెందిన వ్యక్తుల మధ్య ప్రేమగా తెరకెక్కిన ఈ సినిమా కూడా వాలెంటైన్స్ వీక్‌లో మంచి కలెక్షన్స్ సాధించే అవకాశం ఉంది. మొత్తమ్మీద సంక్రాంతి తర్వాత నెలరోజులకు రెండు క్రేజ్ ఉన్న సినిమాలు ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు