పవన్ ‘సర్దార్’ కోసం ఒకటి కాదు, రెండు టీమ్స్ అంట!!

పవన్ ‘సర్దార్’ కోసం ఒకటి కాదు, రెండు టీమ్స్ అంట!!

Published on Feb 9, 2016 9:14 PM IST

sarddar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏడాదికి లేదా రెండేళ్ళకి ఓ సినిమా చేసినా అ సినిమాకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. దానికి ఉదాహరనే ప్రస్తుతం పవన్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఎందుకంటే ఈ సినిమా అనౌన్స్ చేసి రెండేళ్ళు దాటినా ఈ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు, క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. జనవరి నుంచి రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఏప్రిల్ 8న పక్కాగా సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి ఈ చిత్ర టీం ఫిక్స్ చేసింది. అందుకోసమే ఈ చిత్ర టీం జోరుగా షూటింగ్ చేస్తోంది.

అనుకున్న టైంకి సినిమాని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్ర టీం రెండు యూనిట్స్ గా డివైడ్ అయ్యి సినిమా షూట్ ని ఫినిష్ చేస్తున్నాయి. ప్రస్తుతం పవన్, కాజల్ లపై ఓ సాంగ్ షూట్ తో పాటు, కొన్ని కీలక సన్నివేశాలను కేరళలో షూట్ చేస్తున్నరు. ఇక్కడ డైరెక్టర్ బాబీ, నిర్మాత శరత్ మరార్ మెయిన్ టీం ఉంది. మరోవైపు రెండో యూనిట్ హైదరాబాద్ లో ఒక్కోసీన్ లో వచ్చే కొన్ని ఎక్స్ టీరియర్ షాట్స్ ని షూట్ చేస్తున్నారు. కొన్ని జనాలు ఉన్న సీన్స్ కొన్న, పానింగ్ షాట్స్ ని తీస్తున్నారు. లక్ష్మీ రాయ్, సంజనలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాని ఎరోస్ వారు వరల్డ్ వైడ్ రైట్స్ కొనుక్కొని అన్ని ఏరియాల బిజినెస్ కూడా క్లోజ్ చేసేసారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు