క్లీన్ ‘యు’ పొందిన ‘అమృతం – చందమామలో’

క్లీన్ ‘యు’ పొందిన ‘అమృతం – చందమామలో’

Published on Apr 17, 2014 6:52 PM IST

Chandamama-Lo-Amrutham-Telu
టెలివిజన్ ప్రపంచంలో విభిన్న తరహా కామెడీతో సంచలనం సృష్టించిన సీరియల్ ‘అమృతం’. ప్రస్తుతం గుణ్ణం గంగరాజు ఇదే కాన్సెప్ట్ ని మార్చి తీసిన సినిమా ‘అమృతం – చందమామలో’. ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చారు.

ఏప్రిల్ 13న ఆడియో రిలీజ్ చేసిన ఈ సినిమాని మే లో ప్రేక్సహ్కుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాకి ‘చందమామలో అమృతం’ అనే టైటిల్ ని అనుకున్నారు తాజాగా ‘అమృతం – చందమామలో’ అని మార్చారు.

శ్రీ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల, వాసు, హరుష్, ధన్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్ర ప్రొడక్షన్ టీం సరికొత్తగా ప్రమోట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు