రీ రికార్డింగ్ పనుల్లో బిజీ బిజీ ఉన్న బిర్యాని

రీ రికార్డింగ్ పనుల్లో బిజీ బిజీ ఉన్న బిర్యాని

Published on Apr 20, 2014 6:00 PM IST

Ulavacharu-Biryani
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఉలవచారు బిర్యాని’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చెన్నైలో ఉన్నారు, అక్కడ మాస్ట్రో ఇళయరాజా నేతృత్వంలో రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. రీ రికార్డింగ్ చూసి థ్రిల్ అయిపోయిన ప్రకాష్ రాజ్ తన ఆనందాన్ని వీడియో గా తీసి పోస్ట్ చేసాడు.

‘ఉలవచారు బిర్యాని’ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘సాల్ట్ ఎన్ పెప్పర్’ సినిమాకి రీమేక్. ప్రకాష్ రాజ్, స్నేహ, తేజ, సంయుక్త ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీలో ఊర్వశి, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. ఎక్కువ భాగం సినిమాని మైసూర్ లో షూట్ చేసిన ఈ సినిమా విజయంపై ప్రకాష్ రాజ్ చాలా నమ్మకంగా ఉన్నాడు.

ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ మళయాళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాని ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు