‘రంగస్థలం’ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విడుదలైన ప్రతి చోట దిగ్విజయంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. అన్ని చోట్ల సినిమా హౌజ్ ఫుల్ ఆక్యుపెన్సీతో మంచి వసూళ్లను రాబడుతోంది. ఇదిలా ఉండగా చరణ్ సతీమణి ఉపాసన హైదరాబాద్లో కొంతమంది స్పెషల్ వ్యక్తుల కోసం స్పెషల్ షోలను ఏర్పాటు చేశారు.
హైదరాబాద్లోని ఆశ్రయ ఆకృతి అనే స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన వినికిడి లోపం కలిగిన పిల్లలే ఆ స్పెషల్ వ్యక్తులు. స్క్రీనింగ్ సమయంలో ఉపాసన దగ్గరుండి పిలల్లకు కావల్సిన ఏర్పాట్లన్నీ చూసుకున్నారు. పిల్లలు కూడ చిత్రాన్ని వీక్షించి ఎంతో ఉల్లాసంగా గడిపారు. చిత్రంలో కూడ కథానాయకుడు రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్రకు వినికిడి లోపం ఉన్న సంగతి తెలిసిందే.
- చైనాలో సరికొత్త రికార్డ్ నెలకొల్పిన ‘బాహుబలి-2’ !
- ఆసక్తికరమైన సినిమాలతో వస్తున్న సీనియర్ హీరో !
- కాలా ప్రసార హక్కులు దక్కించుకున్న ప్రముఖ ఛానల్
- బాలీవుడ్ లో మంచి ఆఫర్ కొట్టేసిన పూజ హెగ్డే
- సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో సోదరి
సంబంధిత సమాచారం :

Subscribe to our Youtube Channel
తెలుగు రుచి - మల్లెమాల సంస్థ వారు అందిస్తున్న ఈ ఆన్ లైన్ కుకింగ్ ఛానెల్ ద్వారా మీరు నోరూరించే రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాల తయారీని తక్కువ టైమ్ లో నేర్చుకోవచ్చు. ఇందులో అనుభవజ్ఞులైన, ప్రఖ్యాత చెఫ్ లు సులభ రీతిలో అన్ని రకాల వంటకాలను ఎలా చేయాలో మీకు నేర్పుతారు.