ఎట్టకేలకు కొత్త సినిమాపై నోరు విప్పిన అఖిల్!

ఎట్టకేలకు కొత్త సినిమాపై నోరు విప్పిన అఖిల్!

Published on Dec 7, 2016 3:01 PM IST

akhil
‘అఖిల్’ అనే సినిమాతో గతేడాది హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్, ఆ సినిమా ఘోర పరాజయం పాలవ్వడంతో రెండో సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అఖిల్ విడుదలై సంవత్సరం దాటాక దర్శకుడు విక్రమ్ కుమార్‌తో తన కొత్త సినిమా ఉంటుందని ఈమధ్యే తెలియజేశారాయన. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆ సినిమా ప్రస్తావనే లేదు. తాజాగా కొద్దిసేపటిక్రితమే తన కొత్త సినిమా గురించి చెబుతూ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానని తెలిపారు.

“గత సంవత్సర కాలంగా ఓపికగా మంచి సినిమా కోసం ఎదురుచూస్తూ వచ్చా. ఇప్పుడు జీనియస్ దర్శకుడు విక్రమ్ కుమార్ ఓ కొత్త కథను సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను మొదలుపెట్టేస్తున్నాం. ఎదురుచూపులన్నింటికీ మంచి సినిమాతో తెరపడుతోంది” అని అఖిల్ ఈ సందర్భంగా అన్నారు. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మించనున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు