అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమా వచ్చేది ‘బాహుబలి’ తరువాతేనట !
Published on Nov 17, 2016 1:51 pm IST

bhagamathi
‘అరుంధతి, రుద్రమదేవి’ వంటి సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాలకి కేరాఫ్ఐరెక్ట్ చేస్తున్న అడ్రెస్ గా నిలిచిపోయిన నటి అనుష్క ప్రస్తుతం చేస్తున్న మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘భాగమతి’. ‘పిల్ల జమిందార్’ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం అక్టోబర్ లో మొదలైంది. ఈ చిత్రంలో అనుష్క పాత్ర, నటన హైలెట్ గా నిలుస్తాయని, కథ కూడా వైవిధ్యంగా, కొత్తగా ఉంటుందని మొదటి నుండి చిత్ర యూనిట్ చెబుతూ వస్తున్నారు. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది.

ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని స్వీటీ ఫ్యాన్స్ ఆతురతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం అనుష్క నటిస్తున్న ‘బాహుబలి – 2’ చిత్రం విడుదల తరువాత రిలీజవుతుందని తెలుస్తోంది. ఎందుకంటే బాహుబలి తరువాత అనుష్క పాపులారిటీ మరింత పెరిగి సినిమాకి హెల్ప్ అయ్యే అవకాశముంది కనుక ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణ, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పినిశెట్టి, ఉన్ని ముకుందన్ లు పలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 
Like us on Facebook