‘జై లవ కుశ’ ఆడియో ఎప్పుడంటే !

‘జై లవ కుశ’ ఆడియో ఎప్పుడంటే !

Published on Aug 17, 2017 5:25 PM IST


తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్ చేస్తున్న ‘జై లవ కుశ’ కూడా ఒకటి. ‘జనతా గ్యారేజ్ ‘ వంటి హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడం, ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తుండటం, ఇప్పటికే బయటకొచ్చిన జైలు, లవ కుమార్ పాత్రల లుక్స్, జై పాత్ర యొక్క టీజర్ బాగుండటంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దీంతో చిత్ర యూనిట్ ఏమాత్రం ఆలస్యం ఉండకుండా చెప్పిన తేదీ సెప్టెంబర్ 21 కే సినిమాను విడుదలచేయాలని నిర్ణయించుకుని శరవేగంగా పనులు చేస్తున్నారు. అందులో భాగంగానే సెప్టెంబర్ మొదటివారంలో ఆడియోను రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే లవ కుమార్ పాత్ర టీజర్ ను కూడా ఈ నెల 25 వినాయక చవితి సందర్బంగా రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు