దసరాకే వచ్చేస్తోన్న ‘కాష్మోరా’ ట్రైలర్, ఆడియో!

దసరాకే వచ్చేస్తోన్న ‘కాష్మోరా’ ట్రైలర్, ఆడియో!

Published on Sep 21, 2016 11:02 PM IST

kaashmora
తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగు సినీ అభిమానుల్లోనూ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈమధ్యే విడుదలై హిట్ కొట్టిన ‘ఊపిరి’ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరైన కార్తీ, తాజాగా ‘కాష్మోరా’ అనే సినిమాతో మెప్పించేందుకు సిద్ధమయ్యారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కార్తీ సరికొత్త లుక్‌కు ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోయారు.

ఫస్ట్‌లుక్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తోన్న టీమ్ దసరా కానుకగా అక్టోబర్ 7న ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అదేరోజున ఆడియో కూడా విడుదల కానుంది. పూర్తిగా గుండు కొట్టించుకొని, ఓ యుద్ధ నేపథ్యంలో నడిచే కథలో సైనికాధికారిలా కార్తీ ఈ సినిమాలో కనిపించనున్నారు. పీవీపీ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కార్తీ సరసన నయన తార, శ్రీ దివ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు