Like us on Facebook
 
‘పైసా వసూల్’ టీజర్ అప్డేట్ !


నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 101వ చిత్రం ‘పైసా వసూల్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. బాలకృష్ణ, పూరిల కాంబినేషన్ ను ఎన్నడూ ఊహించని అభిమానులు ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. బాలయ్యను పూరి ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడలాని తహతహలాడిపోతున్నారు. ముందుగా విడుదలైన ఫస్ట్ లుక్ పట్ల సంతృప్తి చెందిన ఫాన్స్ తర్వాత విడుదలవబోయే టీజర్ కోసం ఎదుచూస్తున్నారు.

చిత్ర టీమ్ కూడా అభిమానుల అంచనాలను అందుకునేలా టీజర్ ను సిద్ధం చేస్తున్నారట. త్వరలోనే ఈ టీజర్ విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఇకపోతే బాలకృష్ణ, పూరిల స్పీడు వలన అనుకున్న తేదీ కంటే ముందుగానే షూట్ పూర్తికానుండటంతో మొదట అనౌన్స్ చేసిన విడుదల తేదీ సెప్టెంబర్ 28 ని ముందుకు జరిపే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే కొంత సమయం వేచిచూడక తప్పదు. ఇకపోతే శ్రియ శరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు .

Bookmark and Share