ఇంకొక నెలలో విజయ్ సినిమా ఫస్ట్ లుక్ ?

ఇంకొక నెలలో విజయ్ సినిమా ఫస్ట్ లుక్ ?

Published on May 22, 2018 9:41 AM IST

తమిళ స్టార్ హీరో విజయ్ తన 62వ చిత్రాన్ని మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను . గతంలో విజయ్, మురుగదాస్ ల కలయికలో వచ్చిన ‘తుపాకి, కత్తి’ వంటి సినిమాలు భారీ విజయాల్ని అందుకోవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఆశలే ఉన్నాయి.

ఈ సినిమాలో విజయ్ ఇంతకుముందెన్నడూ లేని విధంగా చాలా స్టైలిష్ మెకోవర్లో కనిపిస్తారట. తాజా సమాచారం మేరకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను ఇంకొక నెలలో విడుదలచేస్తారని వినికిడి. సన్ పిక్చర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర క్లైమాక్స్ ను సుమారు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీగా షూట్ చేస్తున్నారట మురుగదాస్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు