Like us on Facebook
 
సరికొత్త రాజకీయాలకు తెరలేపుతున్న మరో స్టార్ హీరో !


కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర తన రాజకీయ రంగప్రవేశంపై క్లారిటీ ఇచ్చేశారు. తాను రాజకీయాల్లోకి రావడానికి సన్నద్ధంగా ఉన్నానని అయన ప్రకటించారు. మార్పు కోసం ఎవరో ఒకరు ముందుకురావాలని, అందుకే ముందుగా తానే వస్తున్నానని అన్నారు. అంతేగాక ప్రజలకు నాయకుడిగా, సేవకుడిగా కాకుండా ఒక కార్మికుడిగా పనిచేసే విధానాన్ని ప్రారంభిస్తానని, ముందుగా ఆసక్తి ఉన్నవాళ్లు తమ అభిప్రాయాలను, ఉపాయాలను తనతో పంచుకోవాలని తెలిపారు.

అలాగే తనకు మోడీతో పాటు ఎంతో మంది నాయకులంటే ఇష్టమని కానీ తాను పాటించాలనుకున్న పద్ధతులకు ఇతర పార్టీలకు పొత్తు కుదరదని, అందుకే తాను ఎన్నో ఏళ్లుగా ఆలోచించి రూపొందించిన విధానాల కోసం కొత్త పార్టీని పెట్టాలనుకుంటున్నానని అన్నారు. అలాగే తన పార్టీలో ఎంచుకోబడి ప్రజలకు కార్మికులుగా పనిచేసే వాళ్లకు జీతాలు ఉంటాయని, దీని వలన పారదర్శకతకు చోటు ఉంటుందని, ఎప్పుడూ ప్రజలకు పనిచేసేవారు అందుబాటులో ఉంటారని అన్నారు. ఇంకో ఏడాదిలో అసెంబ్లీ పోల్స్ జరగనున్న నైపథ్యంలో ఉపేంద్ర ఇలా రాజకీయాల్లోకి రావడం సంచలనంగా మారింది.

Bookmark and Share