స్టైలిష్ గా జరిగిన కమల్ ‘ఉత్తమ విలన్’ ఆడియో

స్టైలిష్ గా జరిగిన కమల్ ‘ఉత్తమ విలన్’ ఆడియో

Published on Mar 2, 2015 1:53 PM IST

Uttama-Villia
సినిమా సినిమాకి నటనలోనే కాకుండా కథల విషయంలో కూడా సరికొత్త ఐడియాలతో ప్రేక్సహ్కులను మెప్పించే స్టార్ హీరో ఉలగనాయగన్ కమల్ హాసన్. కమల్ హాసన్ కి ఒక ఫిల్మ్ మేకింగ్, డైరెక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ లాంటి విషయాలపై కూడా ఎంతో అవగాహన ఉంది. కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉత్తమ విలన్’. ఈ సినిమా ఆడియో లాంచ్ ని కూడా కమల్ హాసన్ చాలా స్టైలిష్ గా లాంచ్ చేసారు. ఈ ఆడియో వేడుక నిన్న చెన్నైలో జరిగింది.

మామూలుగా ఆడియో రిలీజ్ లో ఆడియో సిడిలను రిలీజ్ చేస్తారు. కానీ ఈ సారి కమల్ సరికొత్తగా ఉండడం కోసం ఓ మొబైల్ ఆప్ ని క్రియేట్ చేసారు. ఆ ఆప్ లో సాంగ్స్ అన్నీ అప్లోడ్ చేసారు. ఈ వేదికపై ఈ సినిమా నిర్మాతలో ఒకరైన లింగుస్వామి కమల్ ని ఎవరైనా గెస్ట్ లకి ఈ ఆడియో ఆల్బం ని ప్రెజెంట్ చేయమని కోరితే కమల్ అక్కడ ఆడియో ఫంక్షన్ లో లేని శృతి హాసన్ కి కాల్ చేసి పేస్ టైం ఆడియో ని సెండ్ చేసారు. వీడియో టెలీపతీ ద్వారా ఈ ప్రాసెస్ మొత్తం జరిగింది. ఈ విధానం అక్కడికి వచ్చిన వారిని సర్ప్రైజ్ చేసింది.

జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బంలో మొత్తం 16 ట్రాక్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ పాటలకి తమిళంలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాని ఏప్రిల్ 2న రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు