ప్రేమికులరోజు స్పెషల్ అంటున్న అల్లు అర్జున్

ప్రేమికులరోజు స్పెషల్ అంటున్న అల్లు అర్జున్

Published on Jan 24, 2018 4:10 PM IST

అల్లు అర్జున్, వక్కంతం వంశీల కలయికలో రూపొందుతున్న ‘నా పేరు సూర్య’ చివరి దశ పనుల్లో ఉంది. బన్నీ మిలటరీ అధికారిగా నటిస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ ఇంపాక్ట్ కోదిరోజుల క్రితం బ్రహ్మాండమైన స్పదనను దక్కించుకుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ వేగం పెంచింది. అందులో భాగంగా ఈ నెల 26న రిపబ్లిక్ డే సందర్బంగా ‘సైనికా’ అనే పాటను రిలీజ్ చేయనున్నారు.

అలాగే ఏప్రిల్ 14 ప్రేమికులరోజు ప్రత్యేకంగా రొమాంటిక్ సాంగ్ ను విడుదలచేయనున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్, శేఖర్ లు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిసున్నారు. తెలుగుతో పాటు తమిళం, మళయాలం, భోజ్ పురి, హిందీ, బెంగాలీ, మరాఠి వంటి భాషల్లో కూడా సినిమాను అనువదిస్తున్నారు. ఏప్రిల్ 27న చిత్రం భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు