మరో గౌరవం దక్కించుకున్న ‘పెళ్లి చూపులు’

మరో గౌరవం దక్కించుకున్న ‘పెళ్లి చూపులు’

Published on Sep 27, 2016 7:32 PM IST

Pellichoopulu
ఈ సంవత్సరం విడుదలైన అన్ని సినిమాల్లో ‘పెళ్లి చూపులు’ చిత్రం అనూహ్యమైన భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే గాక యూఎస్ లో సైతం ప్రభంజనం సృష్టించింది. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తేవడమే కాక అందులో నటించిన హీరో విజయ్, హీరోయిన్ రీతూ వర్మ, కమెడియన్ ప్రియదర్శి వంటి నటులకు, దర్శకుడు తరుణ్ భాస్కర్ కు మంచి అవకాశాలనందిస్తూ ఒక పరిపపూర్ణమైన సినిమాగా నిలిచిన ‘పెళ్లి చూపులు’ మరో గౌరవాన్ని దక్కించుకుంది.

ప్రముఖ సాంస్కృతిక సంఘం ‘వంశీ ఇంటర్నేషనల్’ అందించే ‘అక్కినేని అవార్డు’ ను ఈ చిత్రం దక్కించుకుంది. చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి ఈ అవార్డును ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణగారి చేతుల మీదుగా అందుకున్నారు. సరికొత కథ, కథనాలతో సాగుతూ ఆధ్యంతం ఉత్సాహంగా ఉండే ఈ చిత్రం యువతను, కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకుని తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు