మిలియన్ మార్కును అందుకున్న ‘తొలిప్రేమ’ !

మిలియన్ మార్కును అందుకున్న ‘తొలిప్రేమ’ !

Published on Feb 24, 2018 9:05 AM IST


మెగా హీరో వరుణ్ తేజ్ తన కెరీర్లో రెండో మిలియన్ డాలర్ సినిమాను నమోదు చేసుకున్నాడు. ఇంతకుముందు ఆయన నటించిన ‘ఫిదా’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనేగాక ఓవర్సీస్లో కూడ భారీ వసూళ్లను రాబట్టగా ఆయన తాజా చిత్రం ‘తొలిప్రేమ’ కూడ యూఎస్లో మంచి రన్ కనబరుస్తోయింది. నిన్న శుక్రవారం నాటికి ఈ చిత్రం 1 మిలియన్ అందుకుంది.

ఒక్క ‘అ !’ మినహా మిగతా పెద్ద సినిమాలేవీ లేకపోవడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. నూతన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడ మంచి వసూళ్లను రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చి పెట్టింది. ఇకపోతే ప్రస్తుతం వరుణ్ తేజ్ ‘ఘాజి’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు