అభిమానుల్ని తలెత్తుకునేలా చేస్తానన్న వరుణ్ తేజ్ !
Published on Jul 11, 2017 8:43 am IST


మెగా హీరో వరుణ్ తేజ్ చిత్రం ‘ఫిదా’ యొక్క ఆడియో వేడుక నిన్న సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో వరుణ్ తేజ్ తన స్పీచ్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. సాధారణంగా తమ ఆడియో ఫంక్షన్స్ అంటే చిరంజీవిగారో, పవన్ కళ్యాణ్ గారో, చరణ్ లేకపోతే బన్నీనో అతిధులుగా వచ్చే వారని కానీ ఈ కార్యక్రమాన్ని మాత్రం తమ క్రూతో కలిసే చేసుకోవాలనుకున్నామని, వాళ్ళెవరూ లేకున్నా మెగా అభిమానులందరూ వచ్చి సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అన్నారు.

అలాగే ఫ్యాన్స్ నుండి ఇలాంటి సినిమాలు చేయండి అలంటి సినిమాలు చేయండి అంటూ సజెషన్స్ వస్తుంటాయని, తాను కూడా అదే ధోరణిలో ట్రై చేస్తున్నానని, ఇంతకు ముందు కొని తప్పటడుగులు వేసినా ఇకపై మంచి సినిమాలే చేస్తానని, అభిమానులు తలెత్తుకునేలా చేస్తానని అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడిన మాటల్తో వేడుకకు వచ్చిన అభిమానుల్లో సైతమ్ కోలాహలం నెలకొంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ జూలై 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ చిత్రం ‘ఫిదా’ యొక్క ఆడియో వేడుక నిన్న సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో వరుణ్ తేజ్ తన స్పీచ్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. సాధారణంగా తమ ఆడియో ఫంక్షన్స్ అంటే చిరంజీవిగారో, పవన్ కళ్యాణ్ గారో, చరణ్ లేకపోతే బన్నీనో అతిధులుగా వచ్చే వారని కానీ ఈ కార్యక్రమాన్ని మాత్రం తమ క్రూతో కలిసే చేసుకోవాలనుకున్నామని, వాళ్ళెవరూ లేకున్నా మెగా అభిమానులందరూ వచ్చి సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అన్నారు.

 
Like us on Facebook