ఇంటర్వ్యూ : వరుణ్ తేజ్ – కళ్యాణ్ బాబాయ్ చేసినట్టు నేను చేయను !

ఇంటర్వ్యూ : వరుణ్ తేజ్ – కళ్యాణ్ బాబాయ్ చేసినట్టు నేను చేయను !

Published on Feb 9, 2018 6:00 PM IST

మెగా హీరో వరుణ్ తేజ్, నూతన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేసిన చిత్రం ‘తొలిప్రేమ’. రేపు 10న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్బంగా వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్ర) మీ ‘తొలిప్రేమ’కు కళ్యాణ్ గారి ‘తొలిప్రేమ’కు తేడా ఏంటి ?
జ) చాలా తేడా ఉందండీ. బాబాయ్ సినిమా అప్పటి యువతను ఆకట్టుకుంటే, నా సినిమా ఇప్పటి యువతకు నచ్చేలా ఉంటుంది. ట్రీట్మెంట్ మొత్తం వేరుగా ఉంటుంది.

ప్ర) అంటే ఎలా ఉండబోతోంది ?
జ) లేత వయసులో పుట్టే తొలిప్రేమ ఎలా ఉంటుంది, అందులోంచి బయటకురావడం ఎంత బాధాకరంగా ఉంటుంది అనేది ఇందులో చూడొచ్చు.

ప్ర) మీ పాత్ర ఎలా ఉండబోతోంది ?
జ) ఇందులో నేను కొంచెం అగ్రెస్సివ్ గా కనిపిస్తాను. అంటే చేసే ప్రతి పనీ కరెక్టే అనే యారోగెన్స్ ఎక్కువగా నాలో కనిపిస్తుంది. ఎక్కువ హుషారుగా, కొంచెం రఫ్ గా ఉంటాను.

ప్ర) ‘ఫిదా’ లో సినిమాలో మీకు ఇందులో మీకు ఏమైనా పోలికలుంటాయా ?
జ) ఏమీ ఉండవు. ‘ఫిదా;లో చాలా నెమ్మదిగా, మెత్తగా కనిపిస్తాను. కానీ ఇందులో ఇందాక చెప్పినట్టు అగ్రెస్సివ్, యారొగెంట్ గా ఉంటాను.

ప్ర) ఓవర్సీస్లో ప్రీమియర్లు పడ్డాయి కదా టాక్ ఎలా ఉంది ?
జ) చాలా బాగుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది చూసి నాకు ఫోన్ చేసి బాగుందని మెచ్చుకుంటున్నారు. నా పెర్ఫార్మెన్స్ కూడా బాగుందంటున్నారు.

ప్ర) ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ?
జ) ఈ కాలం ప్రేమికులు చిన్న చిన్న గొడవలకే ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోతున్నారు. ఏ సినిమాలో కూడా కథ అదే. ఈ సినిమా చూసైన విడిపోయినవారు అరె అప్పుడు ఎందుకలా చేశాం అని ఆలోచిస్తే చాలు.

ప్ర) మీరు డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఎంచుకోవడం వెనుక కారణం ?
జ) నాకు సినిమాలు బాగా ఇష్టం. హాలీవుడ్ సినిమాలు కూడా ఎక్కువగా చూసేవాడ్ని. అప్పుడు అర్ ఇలాంటి సినిమాలు తెలుగులో వస్తే ఎంత బాగాఉంటుందో అనుకునేవాణ్ణి. అందుకే సినిమాలు మొదలుపెట్టాక ఆ ప్రయత్నమేదో నేనే చేద్దామని భిన్నమైన స్క్రిప్ట్స్ చేస్తున్నాను.

ప్ర) మీ డైరెక్టర్ గురించి చెప్పండి ?
జ) మా డైరెక్టర్ వెంకీ నాకు చాలా కాలం నుండి తెలుసు. ‘ఫిదా’ కంటే ముందే ఈ సినిమాకి సైన్ చేసాను. నా చెల్లెలు నిహారిక వెబ్ సిరీస్ చేసేప్పుడు వెంకీ స్క్రిప్ట్ లో హెల్ప్ చేసేవాడు. నిహారికే వెంకీ దగ్గర కథ ఉంది వినమని చెప్పింది. అతను చెప్పిన కథ నచ్చి ఒప్పుకున్నాను. సినిమాను కూడా చాలా బాగా తీశాడు వెంకీ.

ప్ర) మీ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలు పూర్తిగా వదిలేయడంపై మీ కామెంట్ ?
జ) అది బాబాయ్ వ్యక్తిగతం. ఒక రకంగా ఆయన సినిమాలు వదిలేయడం బాధగానే ఉంది. కానీ సినిమాలకన్నా ఆయనకు చేయాల్సిన పెద్ద పనులు చాలా ఉన్నాయ్. ఆయన ప్రజలకి మరింత దగ్గరగా వెళ్లి సేవ చేస్తానంటే అందరికీ సంతోషమే. అంత స్టార్ డమ్, ఫ్యాన్ బేస్, ఫాలోయింగ్ ఉండి అన్నిటినీ ఒక్కసారిగా వదిలి వెళ్లిపోవడానికి చాలా గట్స్ కావాలి. నేనైతే ఆ సాహసం చేయను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు