కొత్త దర్శకుడితో వరుణ్ తేజ్ ?

కొత్త దర్శకుడితో వరుణ్ తేజ్ ?

Published on Dec 15, 2017 10:12 AM IST

ఫిదా సక్సెస్ తరువాత వరుణ్ తేజ్ నూతన దర్శకుడు వెంకి అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తరువాత వరుణ్ తేజ్ ఏ సినిమాలో నటించబోతున్నాడన్న విషయం పై చర్చ మొదలైంది. రకరకాల పేరు వినిపిస్తున్నా చివరికి రెండు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ‘ఘాజి’ సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డితో ఒక సినిమా చెయ్యబోతున్నాడు ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయ్యింది. తాజా సమాచారం ప్రకారం దిల్ రాజు బ్యానర్లో శశి అనే నూతన దర్శకుడు వరుణ్ తేజ్ తో సినిమా చెయ్యబోతున్నాడని తెలుస్తోంది. త్వరలో ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియజేయనున్నారు మూవీ యూనిట్. సరైన హిట్ కోసం చాన్నాళ్లు ఎదురుచూసిన ఈ మెగాహీరో ‘ఫిదా’ విజయం తరువాత వరుసగా సినిమాలతో దూసుకుపోతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు