రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఫిదా’ !

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘ఫిదా’ !

Published on Jun 23, 2017 6:00 PM IST


‘లోఫర్, మిస్టర్’ వంటి సినిమాలతో వరుసగా పరాజయాల్ని చవి చూసిన యంగ్ హీరో వరుణ్ తేజ్ ఈసారి పూర్తిగా రొమాంటిక్ ఎంటర్టైనర్ జోనర్ ని ట్రై చేస్తూ చేసిన సినిమానే ఈ ‘ఫిదా’. ‘ఆనంద్, గోదావరి’ వంటి రొమాంటిక్ లవ్ సబ్జక్ట్స్ ని తెరకెక్కించిన శేఖర్ కమ్ముల ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మొదట టీజర్ తో ఆకట్టుకున్న ఈ సినిమా ఈరోజు ట్రైలర్ తో సందడి చేసింది.

అంతేగాక తాజాగా విడుదల తేదీని కూడా ఫిక్స్ చేసుకుంది. జూలై 21న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ ఎన్నారై కుర్రాడిగా కనిపించనుండగా హీరోయిన్ సాయి పల్లవి మాత్రం పక్కా తెలంగాణా అమ్మాయిగా అలరించనుంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు