నందమూరి యంగ్ హీరోతో వీరూ పోట్ల.?

నందమూరి యంగ్ హీరోతో వీరూ పోట్ల.?

Published on Oct 4, 2015 7:45 PM IST

vera-potla-kalyan-ram
‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలతో రైటర్ గా కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత బిందాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యి తను సక్సెస్ అవ్వడమే కాకుండా మంచు మనోజ్ కి కూడా పెద్ద హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత నాగార్జునతో రగడ, మంచు విష్ణుతో దూసుకెళ్తా సినిమాలతో డీసెంట్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత వీరూ పోట్ల విక్టరీ వెంకటేష్ – రావితెజలతో కలిసి ఓ సినిమా చేయాలనీ ప్లాన్ చేసాడు. కానీ ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఆ సినిమా ఆగిపోయిందని రవితేజ స్వయంగా తెలిపాడు.

కానీ తాజా సమాచారం ప్రకారం వీరూ పోట్ల నందమూరి కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ కోసం కథని పూర్తి చేసే పనిలో ఉన్నాడట. త్వరలోనే పూర్తి కథని కళ్యాణ్ రామ్ కి వినిపించనున్నాడట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ ఏడాది పటాస్ సినిమాతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ త్వరలోనే ‘షేర్’ సినిమాతో రానున్నాడు. మల్లి కార్జున్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 30న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు