వెంకటేష్, చైతు సినిమాకు ముహూర్తం కుదిరింది !

వెంకటేష్, చైతు సినిమాకు ముహూర్తం కుదిరింది !

Published on Mar 18, 2018 8:45 PM IST

వెంకటేష్, నాగ చైతన్య కలిసి సినిమా చెయ్యబోతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. మొదట ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాని కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా మొదలు కాలేదు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాను డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ నుండి మొదలు కానుంది. సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ తేజ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు, అలాగే అనిల్ రావిపుడితో ఒక సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య సవ్యసాచి, శైలజ రెడ్డి అల్లుడు సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తి కాగానే వెంకటేష్ సినిమా చేస్తాడు చైతు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు