వెంకటేష్ స్పీడ్ పెంచేశాడు..!

Venkatesh
విక్టరీ వెంకటేష్ మళ్ళీ సినిమాల జోరు పెంచిన విషయం తెలిసిందే. ‘బాబు బంగారం’కి ముందు వరకూ కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన, ఇప్పుడు శరవేగంగా సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన హీరోగా నటిస్తోన్న ‘గురు’ కొద్దికాలం క్రితమే సెట్స్‌పైకి వెళ్ళి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తోంది. ఇక తాజాగా అందిన సమాచారం మేరకు గురు షూటింగ్ మొత్తం నిన్నటితో పూర్తయిందట. ఔట్‌పుట్‌పై హ్యాపీగా ఉన్న టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టేందుకు సిద్ధమైపోయింది.

తమిళ, హిందీ భాషల్లో మంచి విజయం సాధించిన ‘సాలా ఖదూస్‌’కు రీమేక్‌గా ‘గురు’ రూపొందుతోంది. సుధా కొంగర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రితికా సింగ్‌కు బాక్సింగ్ కోచ్‍గా వెంకీ కనిపించనున్నారు. వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక గురు పూర్తవ్వడంతో వెంకటేష్ అప్పుడే తన కొత్త సినిమా ప్రీ ప్రొడక్షన్‌కు షిఫ్ట్ అయిపోయారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కే ఆడవాళ్ళూ మీకు జోహార్లు అనే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.

 

Like us on Facebook