వెంకటేష్ కొత్త సినిమాకు ముహూర్తం ఖరారు !

‘గురు’ చిత్రం త‌రువాత వెంక‌టేష్‌ గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమాకు రంగం సిద్దం అయ్యింది. ‘నేనే రాజు నేనే మంత్రి’తో చాలా కాలం త‌రువాత విజ‌యం అందుకున్న తేజ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇద్ద‌రు క‌థానాయిక‌ల‌కు స్థానం ఉన్న ఈ సినిమాలో వెంకటేష్ తో మరో నటుడు నటించబోతున్నాడు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ మరియు ఏకే.ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాయి.

ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు నటించబోయే హీరోకు సంబందించి రకరకాల పేర్లు వినిపించినా ఇంకా ఎవ్వరినీ ఫిక్స్ చెయ్యలేదని సమాచారం. నవంబర్ 16 న సినిమాను అధికారికంగా లాంచ్ చేసి అదే రోజు నుండే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన అనుష్క నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రానా ఈ మూవీలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.

 

Like us on Facebook