వెంకటేష్ కొత్త సినిమా లాంచ్ ఎప్పుడు?

వెంకటేష్ కొత్త సినిమా లాంచ్ ఎప్పుడు?

Published on May 26, 2015 12:58 PM IST

venkatesh
‘గోపాల్ గోపాల’ సినిమా తర్వాత విక్టరీ వెంకటేష్ తన కొత్త సినిమాను ఇప్పటివరకూ మొదలుపెట్టలేదు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ‘గోపాల గోపాల’లో వెంకటేష్, పవన్ కళ్యాణ్‌తో పండించిన అర్థవంతమైన కామెడీ తెలుగులోనూ బాగానే వర్కవుట్ అయింది. ఈ సినిమా తర్వాత వెంకీ పలు హిందీ సినిమాల రీమేక్‌లలో నటించనున్నట్లు వార్తలు వచ్చినా, అవేవీ కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా వెంకటేష్ తన కొత్త సినిమా కోసం సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది.

గతంలో పలు సూపర్ హిట్ సినిమాలకు స్క్రిప్ట్ సమకూర్చిన ఆకుల శివ వెంకీ కొత్త సినిమాకు ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేశారట. దాదాపుగా ఈ కథకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. జూన్ 6న రామానాయుడు జయంతి సందర్భంగా ఈ సినిమా లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు