వెంకటేష్ రెమ్యూనరేషన్ పెంచేశాడా..?

వెంకటేష్ రెమ్యూనరేషన్ పెంచేశాడా..?

Published on Apr 1, 2020 8:05 AM IST

మినిమమ్ గ్యారంటీ హీరోలలో వెంకటేష్ ఒకరు. వరుస హిట్స్ తో విక్టరీ ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ ఈ మధ్య యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ లు,అలాగే వయసుకు దగ్గ పాత్రలు చేస్తున్నారు. 2013లో మహేష్ తో కలిసి ఆయన చేసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తరువాత రామ్ తో మసాలా చేశారు.అలాగే హిందీ హిట్ చిత్రం ఓ మై గాడ్ తెలుగు రీమేక్ గోపాల గోపాల చిత్రంతో పవన్ తో కలిసి నటించడం జరిగింది. ఇక గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఎఫ్ 2సూపర్ హిట్ అందుకుంది.

ఇక ఈ సూపర్ హిట్ చిత్రానికి దర్శకుడు అనిల్ రావిపూడి సీక్వెల్ గా ఎఫ్ 3 ప్లాన్ చేస్తుండగా వెంకటేష్ ఈ పార్ట్ లో కూడా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఐతే ఈ చిత్రం కొరకు
వెంకటేష్ తన రెమ్యూనరేషన్ పెంచేశాడని టాక్. అ తన రెగ్యులర్ రెమ్యూనరేషన్ కి రెట్టింపు ఆయన డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. వెంకటేష్ ట్రాక్ సైతం ఇప్పుడు బాగుంది. ఆయన గత రెండు చిత్రాలు ఎఫ్ 2, వెంకీ మామ మంచి హిట్స్ అందుకున్నాయి. దీనితో ఆయన పారితోషికం పెంచారని వినికిడి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు