మెగా పవర్ స్టార్ తో వెంకీ కుడుముల ?

మెగా పవర్ స్టార్ తో వెంకీ కుడుముల ?

Published on Feb 26, 2020 5:22 PM IST

‘ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘భీష్మ’ మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ రాబడుతూ దూసుకెళ్తుంది. కేవలం మూడు రోజులలోనే భీష్మ ఆంధ్రా మరియు తెలంగాణాలలో కలిపి 14.89 కోట్ల షేర్ రాబట్టి అబ్బురపరిచింది. మొత్తానికి నితిన్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. అయితే ఈ మూవీ సూపర్ హిట్ అవ్వటానికి కారణమైన దర్శకుడు వెంకీ కుడుములకు మంచి పేరు వచ్చింది.

కాగా వెంకీ కుడుముల కొత్త సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. వెంకీ కుడుముల ఇప్పటికే రామ్ చరణ్‌కు ఒక లైన్ చెప్పారని, చరణ్ కూడా ఆ లైన్ కి ఎగ్జైట్ అయ్యాడని.. పూర్తి స్క్రిప్ట్‌ తో రమ్మన్నాడని తెలుస్తోంది. మార్చి చివరి నాటికి, వెంకీ మిగిలిన పూర్తి కథను పూర్తి చేసి చరణ్ కు చెబుతాడట. అన్ని కురిరితే ఈ ప్రాజెక్ట్ 2021లో సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే వెంకీ కుడుముల మరో మెట్టు ఎక్కినట్టే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు