అభిమానులకు వెంకీ ఇచ్చే బర్త్‌డే సర్‌ప్రైజ్..!

అభిమానులకు వెంకీ ఇచ్చే బర్త్‌డే సర్‌ప్రైజ్..!

Published on Dec 11, 2016 10:40 AM IST

Venkatesh
విక్టరీ వెంకటేష్ మళ్ళీ బ్యాక్ టూ ఫాం అంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఈమధ్యే ‘గురు’ షూటింగ్ పూర్తి చేసిన ఆయన, త్వరలోనే ఓ కొత్త సినిమాను మొదలుపెట్టేందుకు సిద్ధమవుతూనే, గురును రిలీజ్‌కు కూడా సిద్ధం చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను విడుదల చేసేందుకు రెడీ అయిపోయారు. డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానులకు ప్రత్యేక కానుకగా ఈ టీజర్ విడుదల కానుంది.

ఇక అదేవిధంగా ఒకరోజు ముందునుంచే వెంకీ గురుకు సంబంధించి ఓ సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట. ఆ సర్‌ప్రైజ్ ఏదైనా కొత్త పోస్టర్ అయి ఉండొచ్చని ఊహించొచ్చు. రేపు సాయంత్రం ఈ ఫస్ట్‌ సర్‌ప్రైజ్‌తో గురు సందడి మొదలుకానుండగా, ఎల్లుండి టీజర్‌ విడుదలవుతుంది. తమిళ, హిందీ భాషల్లో మంచి విజయం సాధించిన ‘సాలా ఖదూస్‌’కి రీమేక్ అయిన ఈ సినిమాలో వెంకీ ఓ బాక్సింగ్ కోచ్‌గా కనిపించనున్నారు. రితికా సింగ్ మరో ప్రధాన పాత్రలో నటించగా, సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు