మెగాహీరో సినిమాకి ప్లస్ కానున్న వెన్నెల కిషోర్ !

మెగాహీరో సినిమాకి ప్లస్ కానున్న వెన్నెల కిషోర్ !

Published on Feb 22, 2017 11:35 AM IST


మెగాహీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ చిత్రం ఈ నెల 24న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో మంచి యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి కామెడీ కంటెంట్ కూడా ఉంది. అందులో ప్రముఖ కమెడియన్ వెన్నెల కిషోర్ పాత్ర ద్వారా జనరేట్ అయ్యే సరికొత్త తరహా కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, సినిమాకి మంచి ప్లస్ అవుతుందని అంటున్నారు.

‘సుప్రీమ్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, మజ్ను’ వంటి సినిమాల్లో ప్రత్యేకమైన హాస్యాన్ని పండించిన వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో పద్మ అనే పాత్రను చేయనున్నాడు. మొదట సాధారణ నటుడిగా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన వెన్నెల కిషోర్ తన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, మాట తీరుతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హార్స్ రేసింగ్ నైపథ్యంలో సాగే ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయగా రకుల్ ప్రీత్ హీరోయిన్ గాను, బాలీవుడ్ నటుడు అనూప్ సింగ్ ఠాకూర్, జగపతి బాబులు విలన్ పాత్రల్లోను నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు