‘స్పైడర్’ సినిమాలోని విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటాయట !
Published on Sep 26, 2017 6:28 pm IST


సూపర్ స్టార్ మహేష్ తొలిసారి తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించిన ద్విభాషా చిత్రం ‘స్పైడర్’. ఎన్నాళ్లగానో ఊరిస్తూ, రూ. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఎలా ఉంటుందో, ముఖ్యంగా బాహుబలి తర్వాత వస్తున్న అతిపెద్ద సినిమా కాబట్టి క్వాలిటీ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలని అందరూ కుతూహలంగా ఉన్నారు. సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం చిత్రంలోని విఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉంటుందట.

ముఖ్యంగా కీలకమైన యాక్షన్ సీక్వెన్సుల్లో చాలా రిచ్ గా, నేచ్యురల్ గా ఉంటాయట. అదే విధంగా సినిమా రెండవ అర్థ భాగం సినిమాకే కీలకంగా ఉంటుందని, ఫ్యామిలీ ఆడియన్సుని కట్టిపడేసేలా ఉంటుందని అంటున్నారు. అలాగే విలన్ గా చేసిన ఎస్. జె సూర్య పాత్ర చాల కలం పాటు గుర్తుండిపోతుందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ ఎంతవరకు నిజమో రేపటితో తేలిపోనుంది.

 
Like us on Facebook