ఈరోజు విడుదలకానున్న విజయ్ ఆంటోని సినిమా ట్రైలర్ !

ఈరోజు విడుదలకానున్న విజయ్ ఆంటోని సినిమా ట్రైలర్ !

Published on Mar 23, 2018 11:44 AM IST

తమిళ హీరో విజయ్ ఆంటోనీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతుడే. ‘బిచ్చగాడు, డా.సలీం, నకిలీ, భేతాళుడు’ వంటి విభిన్నమైన సినిమాల్తో ప్రేక్షకుల్ని అలరించిన ఈయన ఇప్పుడు ‘కాశి’ పేరుతో ప్రేక్షకులను త్వరలో పలకరించనున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ కానుంది.

తమిళంలో ‘కాళి’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కిరుతిగ ఉదయనిధి డైరెక్ట్ చేస్తుండగా విజయ్ ఆంటోనీ తన ఫాతిమా ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆఖరి దశ పనుల్లో ఉన్న ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి స్వయంగా విజయ్ ఆంటోనీ సంగీతాన్ని అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు