‘బిచ్చగాడు’ గా మారిన ప్రముఖ సంగీత దర్శకుడు..!

‘బిచ్చగాడు’ గా మారిన ప్రముఖ సంగీత దర్శకుడు..!

Published on Apr 28, 2016 5:24 PM IST

antony
’దరువు’, ’పులివేట’, ’మహత్మ’, ‘దరువు’ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన విజయ్ ఆంటోని హీరో, నిర్మాతగా చేసిన ’నకిలీ’, ’డా. సలీమ్’ చిత్రాలు తెలుగులో కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇటీవల ఆయన నిర్మాతగా, హీరోగా రూపొందిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘పిచ్చైకారన్’ విడుదల అయి మంచి విజయం సాధించింది.

ఒక బిలియనీర్ బిచ్చగాడుగా ఎందుకు మారాడు ? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో 50 రోజులను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో ‘బిచ్చగాడు’ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమాను మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి విజయ్ ఆంటోని సంగీతం సమకూర్చాడు. ఈ సినిమాకి ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని శశి నిర్వహించగా నూతన నటి సత్నా టైట్స్ కథానాయకిగా పరిచయం అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు