విజయ్ దేవరకొండ ఆ సినిమాలో నటించట్లేదు !

విజయ్ దేవరకొండ ఆ సినిమాలో నటించట్లేదు !

Published on Jul 12, 2020 9:01 AM IST

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులోకి మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కీలకమైనది. అయితే ఈ పాత్రలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడని ఇటివలే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం సెన్సేషనల్ స్టార్ ఈ సినిమాలో నటించట్లేదు. పై వార్త కేవలం రూమరే అని తెలిసింది.

ఇక ఈ రీమేక్ ను దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో మంజు వార్యర్ పాత్ర కూడా కీలకమైనదే. కాగా తెలుగు వర్షన్ లో ఆ పాత్రలో రోజా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే మెగా బృందం నుంచి అధికారిక ప్రకటన రావాలి. మెగాస్టార్ చిరంజీవి సుజీత్ టాలెంట్ పై నమ్మకముంచి అతనికి ఈ భారీ సినిమా అవకాశం ఇచ్చారు. మరి ఈ మెగా ఛాన్స్ ను సుజీత్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు