“మాస్టర్” డిజిటల్ ప్రీమియర్ ను ఇన్ని దేశాల్లో ప్లాన్ చేసారా.!

“మాస్టర్” డిజిటల్ ప్రీమియర్ ను ఇన్ని దేశాల్లో ప్లాన్ చేసారా.!

Published on Jan 27, 2021 11:01 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం “మాస్టర్” అటు తమిళ్ తో పాటలుగా తెలుగులో కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా సంగతి తెలిసిందే. మరి అలాగే ఈ చిత్రానికి సంబంధించి విడుదలపై చాలానే తతంగం నడిచింది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు ఓటిటి లో ఈ సినిమా వచేయడానికి అంతా సిద్ధం అయ్యింది.

ఇక ఇదిలా ఉండగా దీనిపై ఇప్పుడు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఈ చిత్రాన్ని వచ్చే జనవరి 29 నే స్ట్రీమింగ్ కు తీసుకువస్తున్నట్టుగా తెలిపారు. అంతే కాకుండా ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని ఏకంగా 240 దేశాల్లో డిజిటల్ ప్రీమియర్ గా అందుబాటులోకి తీసుకు వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అయితే సినిమా విడుదల కాబడ్డ 16 రోజులకే ఇలా డిజిటల్ గా ఈ సినిమా వచ్చేయడం గమనార్హం. మరి ఈ చిత్రంలో పవర్ ఫుల్ విలన్ గా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించగా మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటించింది. మరి అలాగే లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అనిరుధ్ అందించిన సంగీతం మరో పెద్ద ఎస్సెట్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు