విజయ్ సినిమాకి కథ సమర్పించేసిన రాజామౌళి తండ్రి !

Vijayendra-Prasad1
తమిళ స్టార్ హీరో విజయ్ తన 61వ చిత్రాన్ని దర్శకుడు అట్లీ డైరెక్షన్లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కథను ప్రముఖ కథకుడు, రాజమౌళి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ అందిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ‘బాహుబలి,భజరంగీ భాయ్ జాన్, ఈగ’ వంటి సినిమాలకి కథలను అందించి జాతీయస్థాయి గుర్తింపు పొందారు. అందుకే విజయ్, నిర్మాతలు ప్రత్యేకంగా ఈయన్నే తమ సినిమాకు కథను అందించాలని కోరారు.

తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి విజయేంద్రప్రసాద్ ఇప్పటికే పూర్తి స్థాయి కథను పూర్తి చేసి బౌండెడ్ స్క్రిప్ట్ ను చిత్ర యూనిట్ కు అందించేశారట. అలాగే విజయ్ ప్రస్తుతం భారతం డైరెక్షన్లో ‘భైరవ’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక కాస్త గ్యాప్ తీసుకుని విజయ్ తన 61వ సినిమాని మొదలుపెట్టనున్నాడు.

Bookmark and Share